తిరుమలలో జూన్ 11 నుంచి భక్తులకు అనుమతి

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతినిస్తామని టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జేష్టాభిషేకం ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్సవ విగ్రహాల పటుత్వం కోసమే జేష్ఠమాసంలో మూడు రోజుల పాటు జేష్టాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. 11 నుంచి భక్తులను దర్శనార్థం అనుమతిస్తామని చెప్పిన ఆయన, దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రావద్దని సూచించారు. తిరుమల వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా టికెట్లు […]

Update: 2020-06-06 08:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతినిస్తామని టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జేష్టాభిషేకం ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్సవ విగ్రహాల పటుత్వం కోసమే జేష్ఠమాసంలో మూడు రోజుల పాటు జేష్టాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. 11 నుంచి భక్తులను దర్శనార్థం అనుమతిస్తామని చెప్పిన ఆయన, దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రావద్దని సూచించారు. తిరుమల వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. టీటీడీ కౌంటర్ల ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తుండటంతో తిరుపతిలో టికెట్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచించారు.

Tags:    

Similar News