నేను దేవుళ్లను కించపరచలేదు.. మిమ్మల్ని నొప్పించి ఉంటే నన్ను క్షమించండి

దిశ,వెబ్‌డెస్క్: పెద్దపల్లిలో నిరసన కార్యక్రమాలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ దేవతలపై స్వేరోస్ ప్రతినిధులు చేసిన ప్రతిజ్ఞలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రతిజ్ఞ లపై నెలకొన్న వివాదం పై ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎవరి మనోభావాలయినా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన వారితో తనకు సంబంధంలేదని వివరణిచ్చారు. అంతేకాదు స్వేరోలో కులమతాలకు అతీతంగా అన్ని […]

Update: 2021-03-15 20:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: పెద్దపల్లిలో నిరసన కార్యక్రమాలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ దేవతలపై స్వేరోస్ ప్రతినిధులు చేసిన ప్రతిజ్ఞలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రతిజ్ఞ లపై నెలకొన్న వివాదం పై ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎవరి మనోభావాలయినా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన వారితో తనకు సంబంధంలేదని వివరణిచ్చారు. అంతేకాదు స్వేరోలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకుంటామని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు.

అసలేం జరిగింది

పెద్దపల్లి జిల్లా ధూలికట్టలో సోమవారం స్థానికులు కొందరు బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు బుద్ధ వందనాన్ని పారాయణం చేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దేవుళ్లను కించపరిచేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ణ చేశారని వీహెచ్‌పీ ఫైర్ అయింది.అంతేకాదు ఈరోజు పెద్దపల్లిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.

Tags:    

Similar News