SEBI: రిటైల్ ఇన్వెస్టర్ల రక్షణకు ఎస్ఎంఈ ఐపీఓల అప్లికేషన్ సైజ్ పెంచనున్న సెబీ

రిస్క్ తీసుకునే, పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా సెబీ చర్యలు తీసుకోనుంది.

Update: 2024-11-19 18:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మంగళవారం ఎస్ఎంఈ ఐపీఓల కోసం కనీస దరఖాస్తు పరిమాణాన్ని ప్రస్తుత రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. చిన్న మధ్య తరహా కంపెనీ(ఎస్ఎంఈ) ఐపీఓల్లో చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. వారికి రక్షణ కల్పించేందుకు ఈ ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం. రిస్క్ తీసుకునే, పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేలా సెబీ చర్యలు తీసుకోనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలతో పాటు మర్చంట్ బ్యాంకర్ల సూచనల ఆధారంగానే సెబీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఎస్ఎంఈ ఐపీఓల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో పెత్త ఎత్తున నిధులు కుమ్మరిస్తున్నారని సెబీ తెలిపింది. ఒకవేళ ఎస్ఎంఈ కంపెనీలు ఐపీఓ తర్వాత లిస్టింగ్ సమయంలో దెబ్బతింటే చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు చిన్న రిటైల్ ఇన్వెస్టర్లను ఎస్ఎంఈ ఐపీఓలకు దూరం ఉంచేందుకు అప్లికేషన్ సైజ్‌ను రూ. 2 లక్షలకు పెంచాలని భావిస్తోంది.  

Tags:    

Similar News