పీజీ ఈసెట్ సీట్ల కేటాయింపు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్కిటెక్చర్ కోర్సులకుగాను మొదటి ఫేజ్‌ కన్వీనర్ కోటాలో 5,331 సీట్లను కేటాయించినట్టు టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. అన్ని కోర్సుల్లో కలిపి కన్వీనర్ కోటాలో 8,132 సీట్లు ఉండగా.. 7,686 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 5,331 మందికి సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ వివరించారు. ట్యూషన్ ఫీజుల చెల్లించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 16 వరకూ కేటాయించిన కళాశాలల్లో ఒరిజనల్ […]

Update: 2020-12-10 12:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్కిటెక్చర్ కోర్సులకుగాను మొదటి ఫేజ్‌ కన్వీనర్ కోటాలో 5,331 సీట్లను కేటాయించినట్టు టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. అన్ని కోర్సుల్లో కలిపి కన్వీనర్ కోటాలో 8,132 సీట్లు ఉండగా.. 7,686 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 5,331 మందికి సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ వివరించారు. ట్యూషన్ ఫీజుల చెల్లించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 16 వరకూ కేటాయించిన కళాశాలల్లో ఒరిజనల్ పత్రాలతో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. పీజీ కోర్సుల తరగతులు ఈ నెల 14 నుంచే ప్రారంభమవుతాయని రమేషన్ బాబు తెలిపారు.

Tags:    

Similar News