రాజ్‌భవన్‌లో జైళ్ల శాఖ ఉత్పత్తుల ప్రదర్శన..
దిశ, న్యూస్‌బ్యూరో : జైళ్లలో తయారుచేసిన ఉత్పత్తుల గురించి తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు వివరించారు. జైళ్ల శాఖ డైరెక్టర్ రాజీవ్ త్రివేది నేతృత్వంలో పలువురు ఐజీలు, డీఐజీలు, చర్లపల్లి సూపరింటెండెంట్ దశరాథరామిరెడ్డి గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. జైళ్లలో ఖైదీలు తయారు చేసిన మాస్కులు, సబ్బులు, సానిటైజర్లు, డిటర్జెంట్లు తదితర ఉత్పత్తులను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్ ఎదుట ప్రదర్శించారు. త్రివేది పర్యవేక్షణలో చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి టీమ్ […]
దిశ, న్యూస్‌బ్యూరో : జైళ్లలో తయారుచేసిన ఉత్పత్తుల గురించి తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు వివరించారు. జైళ్ల శాఖ డైరెక్టర్ రాజీవ్ త్రివేది నేతృత్వంలో పలువురు ఐజీలు, డీఐజీలు, చర్లపల్లి సూపరింటెండెంట్ దశరాథరామిరెడ్డి గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. జైళ్లలో ఖైదీలు తయారు చేసిన మాస్కులు, సబ్బులు, సానిటైజర్లు, డిటర్జెంట్లు తదితర ఉత్పత్తులను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్ ఎదుట ప్రదర్శించారు. త్రివేది పర్యవేక్షణలో చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి టీమ్ తక్కువ ఖర్చులో తయారు చేసిన అంబు బ్యాగ్ మెకానికల్ వెంటిలేటర్ గురించి ఈ సందర్భంగా త్రివేది వివరించారు. వీటిని త్వరలో పేషెంట్లకు వాడేందుకుగాను ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
Tags : telangana governor, jail officials, prison made products