టార్గెట్ 2023.. శరవేగంగా పనులు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఏ పనిని సంకల్పించినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడుతున్నది. ప్రజల మెప్పు పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోన్నది. పేషెంట్లకు అతి వేగంగా వైద్యం అందించేందుకు ఇటీవల కాలంలో హైదరాబాద్​ నలుమూలల నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలనుకుంటున్న విషయం విధితమే. అయితే వీటిని కేవలం 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు టాస్క్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 4 మల్టీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​ను టీఆర్​ఎస్​ […]

Update: 2021-09-22 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఏ పనిని సంకల్పించినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడుతున్నది. ప్రజల మెప్పు పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోన్నది. పేషెంట్లకు అతి వేగంగా వైద్యం అందించేందుకు ఇటీవల కాలంలో హైదరాబాద్​ నలుమూలల నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలనుకుంటున్న విషయం విధితమే. అయితే వీటిని కేవలం 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు టాస్క్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 4 మల్టీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​ను టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని తేల్చి చెప్పినది. ఈ మేరకు అవసరమైన వనరులను వేగంగా సమకూర్చుకోవాలని పేర్కొన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయవద్దని ఆదేశాలిచ్చింది. ప్రతీ వారం మెడికల్​ కాలేజీల నిర్మాణాలతో పాటు మల్టీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​ స్టేటస్​ ను ప్రభుత్వానికి నివేదించాలని సీఎం కేసీఆర్​ వైద్యాధికారులకు సూచించారు.

4 వేల పడకలు

గ్రేటర్​ హైదరాబాద్ లో కొత్తగా అందుబాటులోకి రాబోతున్న నాలుగు సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​ లో నాలుగు వేల పడకలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఒక్కో దానిలో సుమారు వెయ్యిపడకలు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని టీమ్స్​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా.. సనత్​ నగర్​ లోని చెస్ట్​, గడ్డి అన్నారంలో, మేడ్చల్​ మాల్కాజ్​ గిరి జిల్లా పరిధిలోని అల్వాల్​ లో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గ్యాస్ట్రో, న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ స్పెషాలిటీ విభాగాలను పటిష్ఠంగా ఏర్పాటు చేసి సెంటర్​ ఆఫ్ ఎక్స్​ లెన్స్​ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్​ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుంది. తద్వారా పేషెంట్లు గోల్డెన్​ అవర్​ మిస్​ కాకుండా సకాలంలో చికిత్స పొందగల్గుతారని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News