TSకు 10లక్షల మెట్రిక్ టన్నుల యూరియా : కేంద్రం

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే యాసంగి సాగు కోసం తెలంగాణకు 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియాను కేంద్రం ప్రకటించింది. గ‌త యాసంగిలో రాష్ట్రానికి 8 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఈ సారి ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు ఆ సంఖ్యను పెంచింది. పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా ఈ ఏడాది యాసంగి సీజ‌న్‌కు 11 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించాలని రాష్ట్ర సర్కార్ కోర‌గా, ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. 10 […]

Update: 2020-09-26 08:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :

రాబోయే యాసంగి సాగు కోసం తెలంగాణకు 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియాను కేంద్రం ప్రకటించింది. గ‌త యాసంగిలో రాష్ట్రానికి 8 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఈ సారి ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు ఆ సంఖ్యను పెంచింది. పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా ఈ ఏడాది యాసంగి సీజ‌న్‌కు 11 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా కేటాయించాలని రాష్ట్ర సర్కార్ కోర‌గా, ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

10 లక్షల టన్నుల యూరియాతో పాటు యసంగి కోసం 1.2 లక్ష టన్నుల డీఎపీ, 1.1 లక్షల‌ టన్నుల పొటాష్, 50 వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్, 5.5 లక్షల టన్నుల ఎరువులు సహా మొత్తం 18.3 లక్షల టన్నుల ఎరువులు సరఫరాకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర నిర్ణ‌యంపై రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కేటాయించిన ఎరువుల‌ను షెడ్యూల్ ప్ర‌కారం స‌ర‌ఫ‌రా చేయాలని అభ్యర్థించారు. నీటి పారుదల వనరులు పెరిగినందున సాగు విస్తీర్ణంలో 30 శాతం పెరుగుదల న‌మోదవుతుందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు కేటాయింపులు చేయాల‌ని వ్యవసాయ మంత్రి కేంద్రాన్ని కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..