ఏసీబీకి చిక్కిన టీఎస్ఇడబ్ల్యుఐడీసీ ఏఈ
దిశ,టేకుమట్ల(చిట్యాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం “టీఎస్ఇడబ్ల్యుఐడీసీ” ఇంచార్జి సైట్ ఇంజినీర్ కుమారస్వామి ఏసీబీకి చిక్కారు. రూ 5 వేలు లంచం తీసుకుంటుండగా కుమార స్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం… కుందనపల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన మంచినీటి పైపుల మరమ్మతుల పనులను దేశెట్టి ఓదెలు అనే వ్యక్తి చేపట్టాడు. కాగా నిర్మాణ పనుల బిల్లుల కోసం సదరు ఏఈ లంచం కోసం ఓదేలును డిమాండ్ చేశాడు. దీంతో […]
దిశ,టేకుమట్ల(చిట్యాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం “టీఎస్ఇడబ్ల్యుఐడీసీ” ఇంచార్జి సైట్ ఇంజినీర్ కుమారస్వామి ఏసీబీకి చిక్కారు. రూ 5 వేలు లంచం తీసుకుంటుండగా కుమార స్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం… కుందనపల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన మంచినీటి పైపుల మరమ్మతుల పనులను దేశెట్టి ఓదెలు అనే వ్యక్తి చేపట్టాడు.
కాగా నిర్మాణ పనుల బిల్లుల కోసం సదరు ఏఈ లంచం కోసం ఓదేలును డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన ఓదెలు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం టేకుమట్ల మండలకేంద్రంలోని తిరుమల ఫర్టిలైజర్ షాప్‌కు రావాల్సిందిగా కుమార స్వామిని ఓదేలు కోరాడు. ఫర్టిలైజర్ షాపు వద్దకు చేరుకుని రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా కుమార స్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.