టీఎస్ ఈడీసెట్ పరీక్షల తేదీలు ఖరారు

దిశ, తెలంగాణ బ్యూరో:  టీఎస్ ఈడీసెట్ పరీక్షను ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించనున్నారు. మూడు సెషన్స్ లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తం 42,399 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 49 సెంటర్లలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షలకు 13,726 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 25న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. […]

Update: 2021-08-18 09:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఈడీసెట్ పరీక్షను ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించనున్నారు. మూడు సెషన్స్ లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తం 42,399 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 49 సెంటర్లలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షలకు 13,726 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 25న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. 45 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 14,338 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మూడవ సెషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 45 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 14,335 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఏపీ విద్యార్థుల కోసం కర్నూల్, విజయవాడలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు 90 నిమిషాల ముందుగానే చేరుకోవాలని టీఎస్ ఈడీసెట్ కన్వీనర్ ఏ.రామకృష్ణ సూచించారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్, గ్లోస్‌, శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటీల్‌ను వెంట తీసుకురావాలని నిబంధనలు విధించారు.

Tags:    

Similar News