హైడ్రో క్లోరోక్విన్ పంపించండి: మోడీకి ట్రంప్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : అమెరికా ఆర్డర్ చేసిన హైడ్రోక్లోరిక్విన్ ఔషధాలను పంపించాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు భారత ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చేసిన ఆర్డర్ పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. అమెరికా ఆర్డర్ లను విడుదల చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు వైట్ హౌస్ లో ట్రంప్ వెల్లడించారు. కరోనా నియంత్రణలో హైడ్రో క్లోరోక్విన్.. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ట్రంప్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ […]
న్యూఢిల్లీ : అమెరికా ఆర్డర్ చేసిన హైడ్రోక్లోరిక్విన్ ఔషధాలను పంపించాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు భారత ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చేసిన ఆర్డర్ పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. అమెరికా ఆర్డర్ లను విడుదల చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు వైట్ హౌస్ లో ట్రంప్ వెల్లడించారు. కరోనా నియంత్రణలో హైడ్రో క్లోరోక్విన్.. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ట్రంప్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ మాట్లాడినట్టు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు గానీ.. ట్రంప్ విజ్ఞప్తిని పేర్కొనకపోవడం గమనార్హం. ఫలప్రదమైన సంభాషణ జరిగిందని, కరోనాపై పోరుకు యూఎస్.. భారత్ ద్వైపాక్షిక సంబంధాన్ని సమర్థవంతంగా వినియోగించబోతున్నట్టు మోడీ తెలిపారు. హైడ్రోక్లోరిక్విన్ సహా దాని ఫార్ములేషన్ ఎగుమతిపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Tags: Trump, us, india, export, ban, trump, modi