‘నన్ను మర్చిపోలేక పోతున్నారా’

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ పెళ్లిలో సందడి చేశారు. నన్ను మర్చి పోలేక పోతున్నారా అని ఆహ్వానితులని ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలో జరిగిన వివాహ వేడుకలకు ట్రంప్ హాజరయ్యారు. నూతన వధూవరులను దీవించారు. నూతన జంట ఎంతో అందంగా కనిపిస్తోంది వారి భవిష్యత్తు ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్రంప్ ఆశీర్వదించారు . నూతన వధూవరులను అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. […]

Update: 2021-03-30 00:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ పెళ్లిలో సందడి చేశారు. నన్ను మర్చి పోలేక పోతున్నారా అని ఆహ్వానితులని ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలో జరిగిన వివాహ వేడుకలకు ట్రంప్ హాజరయ్యారు. నూతన వధూవరులను దీవించారు. నూతన జంట ఎంతో అందంగా కనిపిస్తోంది వారి భవిష్యత్తు ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్రంప్ ఆశీర్వదించారు . నూతన వధూవరులను అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నవంబర్ లో జరిగిన ఎన్నికలలో బైడన్ విజయాన్ని ఒప్పుకోని డోనాల్డ్ ట్రంప్ మరోసారి బైడన్ పై విమర్శలు గుప్పించారు.

బైడెన్ బాధ్యతలు తీసుకున్న తరువాత వలసవాదుల సంఖ్య పెరిగిపోయిందని, అనాధ బాలలు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. యూఎస్, మెక్సికో సరిహద్దుల విషయాన్ని ప్రస్తావించిన ఆయన చైనా, ఇరాన్ తదితర దేశాలతో అమెరికా వైఖరిని సైతం తప్పుబట్టారు. ఈ చిన్నారుల పరిస్థితి ఏంటి? గతంలో ఎవరూ అంత దుర్భరంగా తమ బాల్యాన్ని గడపలేదు” అని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఆయన ప్రశ్నించారు. వివాహ వేడుకలో ట్రప్ మాటలకు అతిథిల నుంచి మంచి స్పందన వచ్చింది.

Tags:    

Similar News