‘నేను ముందే చెప్పాను.. ఈ వైరస్ అక్కడిదే’
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ (coronavirus) గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ముందే చెప్పాను కరనా వైరస్ చైనా ల్యాబ్ లో పుట్టిందేనని.. ఇప్పుడు అదే నిజం అయ్యిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాలోని వూహాన్ (Wuhan) ల్యాబ్‌లోనే ఈ వైరస్ సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనలపై ట్రంప్ స్పందిస్తూ.. మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ పుట్టుక గురించి […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ (coronavirus) గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ముందే చెప్పాను కరనా వైరస్ చైనా ల్యాబ్ లో పుట్టిందేనని.. ఇప్పుడు అదే నిజం అయ్యిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాలోని వూహాన్ (Wuhan) ల్యాబ్‌లోనే ఈ వైరస్ సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనలపై ట్రంప్ స్పందిస్తూ.. మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పింది నిజమైందని, ఇంతటి విధ్వంసం సృష్టించినందుకు చైనా యావత్ ప్రపంచానికి 10 లక్షల డాలర్ల భారీ మూల్యం చెల్లించాలన్నారు.
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర గడుస్తున్నది. ఈ మహామ్మారి వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా దీని పుట్టుపూర్వోత్తరాలపై ఎలాంటి స్పష్టత అనేదే లేదు. అయితే ఈ వైరస్‌ను చైనానే (China) సృష్టించిందని, ఇది కుంగ్ ఫూ వైరస్ అని ట్రంప్ (Donald Trump) గతేడాదే ఆరోపించారు. కానీ ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢఛారి సంస్థలూ పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడినా ఇటీవల మళ్లీ చైనా కుట్ర కోణం తెరపైకి వచ్చింది. ఈ వైరస్ చైనా సృష్టించిదేనని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్ చేసిన పరిశోధనల ఫలితమే ఈ మహమ్మారి విలయమని ఇటీవల బ్రిటన్ సహా పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.