అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చాల్సిన అవసరం మాకు లేదు : చైనా

బీజింగ్/ వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా చైనా, అమెరికాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. వైరస్ పుట్టుకకు కారణం చైనాయేనని, అంతే కాకుండా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని ఇతర దేశాలకు సరైన సమయంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి నష్టం సంభవించిందని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఇంకో అడుగు ముందుకు వేసి.. తనను రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఓడించేందుకు టైనా విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ […]

Update: 2020-04-30 07:30 GMT

బీజింగ్/ వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా చైనా, అమెరికాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. వైరస్ పుట్టుకకు కారణం చైనాయేనని, అంతే కాకుండా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని ఇతర దేశాలకు సరైన సమయంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి నష్టం సంభవించిందని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఇంకో అడుగు ముందుకు వేసి.. తనను రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఓడించేందుకు టైనా విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌కు సాయం చేసేందుకు చైనా ఆసక్తికనపరుస్తోందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్ గురువారం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం. అక్కడి ప్రజలు చైనాను ఎన్నికల విషయంలోకి తమను లాగరనే అనుకుంటున్నాను. అయినా కొంత మంది రాజకీయ నాయకులు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ అమెరికా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం కరోనా వైరస్ మాత్రమే వాళ్ల శత్రువు. అంతేకాని చైనా కాదు’ అని గెంగ్ షాంగ్ పరీక్షంగా ట్రంప్‌కు చురకలంటించారు.

Tags : Coronavirus, Presidential Elections, USA, America, Donald Trump, China, Geng Shang, Republic Party

Tags:    

Similar News