చైనా‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్ సహా ఆసియాలోని ఇతర దేశాలతో చైనా ఆధిపత్య ధోరణి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. చైనా తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కైలీ మెక్ ఎనాని తెలిపారు. ఇండియా, చైనా సరిహద్దులో నెలకొన్న ఘర్షణనలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఇండియా చైనా సరిహద్దులో చైనా దుందుడుకు తనం.. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ వైఖరిని వెల్లడిస్తున్నదని వివరించారు. ఈ చర్యలు […]

Update: 2020-07-02 11:32 GMT

వాషింగ్టన్: భారత్ సహా ఆసియాలోని ఇతర దేశాలతో చైనా ఆధిపత్య ధోరణి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. చైనా తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కైలీ మెక్ ఎనాని తెలిపారు. ఇండియా, చైనా సరిహద్దులో నెలకొన్న ఘర్షణనలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఇండియా చైనా సరిహద్దులో చైనా దుందుడుకు తనం.. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ వైఖరిని వెల్లడిస్తున్నదని వివరించారు. ఈ చర్యలు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని మాత్రమే వెల్లడిస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Tags:    

Similar News