అచ్చంపేటలో కారు జోరు.. తగ్గిన వార్డులు

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా లో ని రెండోసారి జరిగిన అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు వెలువడ్డాయి. కౌంటింగ్ పట్టణంలోని జె.ఎం.జె పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎన్నికల అధికారి శ్రీహరి రాజు, ఆర్డీఓ పాండు నాయక్, డీఎస్పీ నర్సింలు ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగాయి. మొదటి సారి జరిగిన పురపోరులో అధికార పార్టీ 20 కి 20 వార్డులు గెలుచుకోగా నేటి ఎన్నికల్లో 13 స్థానాలకు పరిమితమై చైర్మన్ […]

Update: 2021-05-03 07:20 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా లో ని రెండోసారి జరిగిన అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు వెలువడ్డాయి. కౌంటింగ్ పట్టణంలోని జె.ఎం.జె పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎన్నికల అధికారి శ్రీహరి రాజు, ఆర్డీఓ పాండు నాయక్, డీఎస్పీ నర్సింలు ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగాయి. మొదటి సారి జరిగిన పురపోరులో అధికార పార్టీ 20 కి 20 వార్డులు గెలుచుకోగా నేటి ఎన్నికల్లో 13 స్థానాలకు పరిమితమై చైర్మన్ పదవిని దక్కించుకున్నది. మొత్తంగా ప్రజలలో మార్పు జరిగిందని ఈ ఎన్నికల ఫలితాలతో తెలిసిపోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ లో 20 వార్డులు ఉండగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులతో 66 మంది బరిలో ఉన్నారు. 20 వార్డులలో 13 వార్డులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా, ఆరో వార్డు లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ఒక్క వార్డుతో బీజేపీ పార్టీ బోణీ కొట్టింది.

అచ్చంపేట మున్సిపాలిటీ విజేతలు గా నిలిచారు.

1)వార్డు గౌరి శంకర్ (కాంగ్రెస్)
2) వార్డు సుంకరి నిర్మల(టీఆర్ఎస్)
3)వార్డు సోంమ్లా (టిఆర్ఎస్)
4)వార్డు మోహరాజ్ బేగం.(టీఆర్ఎస్)
5)వార్డు లావణ్య (టీఆర్ఎస్)
6)వార్డు రమేష్ (టీఆర్ఎస్)
7)వార్డు నూరి భేగం (కాంగ్రెస్)
8) వార్డు చిట్టెమ్మ (కాంగ్రెస్)
9) వార్డు సుగుణమ్మ(బీజేపీ)
10)వార్డు సునీత(కాంగ్రెస్)
11) వార్డు సంధ్యా (కాంగ్రెస్)
12)వార్డు ఖాజాభీ(కాంగ్రెస్)
13) వార్డు అంతటి శివ (టీఆర్ఎస్)
14) వార్డు గార్ల పాటి శ్రీనివాస్(కాంగ్రెస్)
15) వార్డు మన్ను పటేల్ (టీఆర్ఎస్)
16)వార్డు ఎడ్ల నర్శింహ గౌడ్(టీఆర్ఎస్)
17)వార్డు తగురం శ్రీను (టీఆర్ఎస్)
18)వార్డు గోపిశెట్టి శివ(టీఆర్ఎస్)
19)వార్డు శైలజ రెడ్డి (టీఆర్ఎస్)
20)వార్డు రమేష్ రావు(టీఆర్ఎస్)

Tags:    

Similar News