Kalvakuntla Kavitha :‘దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్’
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ ఒకటి అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ… దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ ముందుందని అన్నారు. ఇది ఎవ్వరో చెప్పిన విషయం కాదని […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ ఒకటి అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ… దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ ముందుందని అన్నారు. ఇది ఎవ్వరో చెప్పిన విషయం కాదని వివిధ గణంకాలు చెబుతున్నాయన్నారు.
తెలంగాణలో ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం పార్టీ అధినేత సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ అని అన్నారు. ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మితమవుతున్నాయని ప్రతి గ్రామంలోని కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. కార్యాలయాల్లో ఉండే సిబ్బంది, ఇన్సూరెన్స్ లాంటి అనేక అంశాల్లో కార్యకర్తలకు సహాయసహకారాలు అందిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేసి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మెన్ ప్రబాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికేలా నర్సరెడ్డి, పార్టి సినియర్ నాయకులు ఎఎస్ పోశేట్టి, ఈగ గంగారెడ్డి పార్టి నేతలు ప్రజా ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు.