అర్హులైన వారికి ఆసరా పెన్షన్‌లు అందవా..?

పింఛన్‌ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో

Update: 2024-11-28 04:48 GMT

దిశ,ఎల్లారెడ్డి : పింఛన్‌ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు పక్షం రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురిలో ఆశలు చిగురిస్తున్నాయి.

ఎన్నాళ్లకో మోక్షం..

ఆసరా దరఖాస్తులను ప్రభుత్వం దాదాపుగా పదేళ్ల పాటుగా పక్కన పెట్టింది. భర్త మృతి చెందితే ఆయన స్థానంలో భార్యకు మంజూరు చేయలేదు. వితంతు విభాగం కింద దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సకాలంలో పింఛన్లు మంజూరు కాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వితంతువులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో, ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో వినతులు అందిస్తున్నా రు. వీరికి ప్రత్యేక వెసులుబాటు లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జీవిత భాగస్వామికి ఆసరా పింఛను నిర్ణయంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని ఆశలు పెంచుకుంటున్నారు.

గత ప్రభుత్వ పాలనలో కొత్త పెన్షన్ల ఊసే లేదు. కొత్త రేషన్ కార్డులు మరియు పెన్షన్ల విధానాన్ని మరిచిపోయి ఎంతోమంది అర్హులైన వారు ఆసరా అందక అవస్థలు పడుతున్నప్పటికీ మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టిన, గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాల లేకపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం కావస్తున్న ఏ పద్యంలో ఇకనైనా కొత్త పెన్షన్లు వస్తాయని ఆసరా పొందాల్సిన లబ్ధిదారులందరూ ఎదురుచూస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పింఛన్‌ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు పక్షం రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురిలో ఆశలు చిగురిస్తున్నాయి. దంపతుల్లో ఒకరు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి వితంతు లేదా వృద్ధాప్య ఆసరా పింఛను అందించడానికి సర్కార్ చర్యలు తీసుకుంటోందా. జిల్లాలోని అన్ని మండలాల్లో వృద్ధులు ఎందరో ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..ఎన్ని దరఖాస్తులు అందజేయాలి

వృద్ధాప్య పింఛన్‌ దారుడు మరణిస్తే జీవిత భాగస్వామి తన ఆధార్‌ కార్డుతో పాటు చనిపోయిన వ్యక్తి మరణ దృవీకరణ పత్రాన్ని జత చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. అదే పట్టణాల్లో అయితే బి ల్‌ కలెక్టర్‌కు అప్పగించాలి. ఈ పత్రాలు స్వీకరించిన అధికారులు మండల స్థాయిలో అయితే వీటిని వెంటనే ఎంపీడీవో పట్టణాల్లో అయితే ము న్సిపల్‌ కమిషనర్‌కు పంపించాలి. వీరి పరిశీలన అనంతరం జిల్లా గ్రా మీ ణాభివృద్ధి అధికారి పరిశీలించి కలెక్టర్‌ ఆమోదం కోసం పంపించాలి. వీటి కోసం ఇప్పటికే ఆసరా పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రక్రియ లన్నింటినీ 15 రోజుల లోపు పూర్తి చేయాల్సి ఉంది.

అంటే దరఖాస్తు చేసుకున్న వారికి పక్షం రోజుల్లోగా మంజూరు అవుతుంది. ఈ నిర్ణయంతో గ్రామాల్లోని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాగస్వాములు మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పింఛ న్‌ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సమయానికి ఇప్పటికి కూడా భర్తను కోల్పోయిన మహిళలకు వృద్ధులకు అర్హులైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కనీసం ఈసారైనా ఈ ప్రభుత్వం ఆసరా పెన్షన్ అందిస్తుందని ఆరాటపడుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


Similar News