ఈటల అనుచరులను టార్గెట్ చేసిన టీఆర్‌ఎస్..?

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‘భూ’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న, మొన్నటి వరకూ ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్‌లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటలపై మాటలు తూటాలు పేల్చారు. అయితే.. ఈటలకు విరామం ఇచ్చారేమో కానీ.. ఇప్పుడు ఆయన అనుచరులను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ లేని ఆరోపణలను […]

Update: 2021-05-06 02:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‘భూ’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న, మొన్నటి వరకూ ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్‌లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటలపై మాటలు తూటాలు పేల్చారు. అయితే.. ఈటలకు విరామం ఇచ్చారేమో కానీ.. ఇప్పుడు ఆయన అనుచరులను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ లేని ఆరోపణలను ఇప్పుడు తెరపైకి తెచ్చి ఊహించని రీతిలో షాకులిస్తున్నారు.

ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంక్ నోటీసులు పంపింది. సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్నప్పుడు నిధులు గోల్‌మాల్ చేశారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 18 లక్షల రూపాయల అవినీతి జరిగిందని గురువారం నాడు బ్యాంకు నోటీసులు పంపింది. అయితే.. ఈ నోటీసులపై ఇంతవరకూ సాదవ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా.. గత ఐదు రోజులుగా ఈటలకు సాదవ రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఇందుకే ఆయన్ను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందని జడ్పీటీసీ, ఈటల అనుచరులు చెప్పుకుంటున్నారు. మున్ముందు ఇంకెంత మంది ఈటల అనుచరులకు ప్రభుత్వం షాకిస్తుందో అని కరీంనగర్ జిల్లా నేతలు సర్వత్రా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News