చందూలాల్ ను తలుస్తూ.. కన్నీరు పెట్టుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : ములుగు మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ ( 66) గురువారం రాత్రి 11 హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ […]

Update: 2021-04-16 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ములుగు మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ ( 66) గురువారం రాత్రి 11 హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి స్వగ్రామమైన ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామం పరిధి లోని సారంగ పల్లికి ఆయన పార్థివదేహాన్ని తీసుకొచ్చారు . మాజీ మంత్రి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేయనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి మృతి తో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ములుగు జిల్లా కేంద్రంలో ఆయన మృతికి షాపులు బంద్ చేసి సంతాపం తెలిపారు.

Tags:    

Similar News