‘ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి..’

దిశ,హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని పలువురు నాయకులను, ప్రజా ప్రతినిధులను ఈటల రాజేందర్ తన అనుచరులతో ప్రలోభపెట్టేందుకు చూస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. ఈటల బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ విమర్శించడం సరికాదన్నారు. ఈటల మమ్ములను ప్రలోభ పెట్టేందుకు చూశారని ఎంపీపీ ఇరుమల్ల రాణి ఆరోపించారు. ప్రలోభలకు లొంగని నాయకులను కొంతమంది ఈటల అనుచరులు […]

Update: 2021-06-07 04:12 GMT

దిశ,హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని పలువురు నాయకులను, ప్రజా ప్రతినిధులను ఈటల రాజేందర్ తన అనుచరులతో ప్రలోభపెట్టేందుకు చూస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాట్లాడారు.

ఈటల బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ విమర్శించడం సరికాదన్నారు. ఈటల మమ్ములను ప్రలోభ పెట్టేందుకు చూశారని ఎంపీపీ ఇరుమల్ల రాణి ఆరోపించారు. ప్రలోభలకు లొంగని నాయకులను కొంతమంది ఈటల అనుచరులు భయపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచాం కాబట్టే ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల గ్రహించాలని మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక మండిపడ్డారు. గత మూడు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులను పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు పంపి డబ్బుల ఆశ చూపి తన వైపు లాక్కోవాలని చేస్తుండటం సిగ్గు చేటన్నారు. ఈటల రాజేందర్ ప్రలోభాలకు లొంగే వారెవరూ టీఆర్ఎస్ లో లేరని చెప్పారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఈటల రాజేందర్ ప్రజల్లో చులకన అయ్యారన్నారు.

పార్టీ టికెట్ పై గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ పార్టీలో ఉంటే ఈటల రాజేందర్ మాత్రం పార్టీ డబ్బులు ఇచ్చి తనకు ఆత్మీయులను దూరం చేసారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అమల్ చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి శ్రీరామరక్ష అని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News