తీవ్ర జ్వరంతో 13 ఏళ్ల బాలుడు మృతి

తీవ్ర జ్వరంతో బాధపడుతూ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలంలో జరిగింది.

Update: 2024-11-22 10:12 GMT

దిశ, మేడిపల్లి : తీవ్ర జ్వరంతో బాధపడుతూ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముంజ రిషి(13) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


Similar News