కర్రనే ఊతం.. పట్టించుకోకుంటే ప్రాణాలు ఖతం..

కరెంట్ స్తంభం ఉండాల్సిన చోట కర్రను సపోర్ట్ గా

Update: 2024-11-22 05:56 GMT

దిశ,ఎల్లారెడ్డిపేట : కరెంట్ స్తంభం ఉండాల్సిన చోట కర్రను సపోర్ట్ గా చేసి ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా రైతులు ,ప్రజలు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఏకంగా కరెంట్ తీగలు ప్రమాదకరంగా రోడ్డు పక్కనే ఉన్న సెస్ అధికారుల కంటపడకపోవడం విశేషం. ఎల్లారెడ్డి పేట గ్రామం నుండి కిషన్ దాస్ పేట,కిష్టం పల్లి మీదుగా గొల్లపల్లి వెళ్ళే దారిలో కరెంట్ ప్రమాదం పొంచి ఉంది.ఇక్కడ నుండి నిత్యం రోడ్డు రాకపోకలతో రద్దీగా ఉంటుంది.

అయినా కానీ ఇలా కర్ర ను అడ్డం పెట్టుకొని వరి కోతల సమయం నుండి లారీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తరలిస్తున్న క్రమంలో లారీలకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఈ ఉపాయం చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సెస్ అధికారులను కోరుతున్నారు.ఒక వేళ ఏదైనా ప్రమాదం జరిగితే సెస్ అధికారులు బాధ్యత వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.ప్రమాదకరం గా ఉన్న కరెంట్ తీగలు వెంటనే సరిచేయాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.


Similar News