చర్లపల్లి జైలులో ఎంపీ సంతోష్
హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దూసుకుపోతున్నారు. ఆరో విడతలో భాగంగా ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి మొక్కలు నాటిన ఆయన తాజాగా చర్లపల్లి జైలులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఖైదీలతో కలిసి ఆయన జైలు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఖైదీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని.. సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.