ఎంపీలు బండి, గుండులవి ఫేక్ మాటలు: ఎంపీ రంజిత్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఫైరయ్యారు. బండి, గుండు ఎంపీలు ఫేక్ కామెంట్లు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా పోరాటం చేయాలని సూచిస్తే, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం భేష్ అని ప్రశంసిస్తే… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ […]

Update: 2020-06-23 09:58 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఫైరయ్యారు. బండి, గుండు ఎంపీలు ఫేక్ కామెంట్లు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా పోరాటం చేయాలని సూచిస్తే, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం భేష్ అని ప్రశంసిస్తే… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో ముందుకు వెళ్తోందన్నారు.

అరవింద్ తండ్రి పింకీ కాదా !: జీవన్‌రెడ్డి

టీఆర్ఎస్ నాయకులను పింకీలు అంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి డీఎస్.. పింకీ కాదా అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతలు స్థాయి మరచి ప్రవర్తిస్తే మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తామన్నారు. బీజేపీ నేతలు కరోనా కేసులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జేపీ నడ్డా ఇది తెలంగాణ గడ్డ అన్న విషయం తెలుసుకోవాలన్నారు. బీజేపీ పాలిత ప్రాంతమైన గుజరాత్‌లో 27వేల కరోనా కేసులు నమోదయ్యాయని, అక్కడ ఏం చేస్తున్నారన్నారు. గుజరాత్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించి కరోనా కేసులు పెరగడానికి కారణమైంది మోడీ కాదా ? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

Tags:    

Similar News