రేవంత్ ఓ పెంపుడు కుక్క : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ పై అసత్య ఆరోపణలు.. పదజాలం మార్చుకోకపోతే నాలుక కోస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్ట్ అని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు రేవంత్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. టెంట్, స్టంట్, ప్రెసెంట్ ..ఆప్సెంట్ రాజకీయంను రేవంత్ రెడ్డి నడుపతున్నాడని ధ్వజమెత్తారు. 100 […]

Update: 2021-08-26 10:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ పై అసత్య ఆరోపణలు.. పదజాలం మార్చుకోకపోతే నాలుక కోస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్ట్ అని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు రేవంత్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. టెంట్, స్టంట్, ప్రెసెంట్ ..ఆప్సెంట్ రాజకీయంను రేవంత్ రెడ్డి నడుపతున్నాడని ధ్వజమెత్తారు. 100 మంది ఎమ్మెల్యేలను తొక్కితే రేవంత్ రెడ్డి మూడు అడుగులున్న ఆయన 30 అడుగుల లోతుకుపోయి కనుమరుగవుతాడని హెచ్చరించారు.

రేవంత్ భాష గురించి రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి ట్విట్టర్లో ట్వీట్ చేశానని దానిపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ది మాటలు, మూటలు, ముఠాల సంస్కృతి అని ఆరోపించారు. ఒక మల్లారెడ్డి, మైనంపల్లి మాట్లాడుతేనే సహించలేకపోతున్నాడని ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మాట్లాడితే తట్టుకుంటాడా అని ప్రశ్నించాడు. థార్డ్ క్లాస్ మాటలను రేవంత్ రెడ్డి మానుకోవాలని సూచించారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే ఆధారాలతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఎవరి పెంపుడు కుక్కో అందరికీ తెలుసని, మల్కాజిగిరి ఎంపీ గా చంద్రబాబు దయతో గెలువడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటల్లో చూపితే మేము ఇక చేతల్లో చూపిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎంతో మంది పీసీసీలు ఉన్నారని ఎవరూ కూడా సీఎంలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. రేవంత్ చర్యలు దుర్మార్గాలు శృతిమించితే ఏం చేయాలో మాకు తెలుసు అని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈరోజు కేసీఆర్ అవసరమే ఉండేది కాదన్నారు.

వారు ప్రజలను పట్టించుకోకపోవడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని, రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్ కు అంబేద్కర్ పేరు పెడతామని అంటున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఎం కార్యాలయానికి, ప్రగతి భవన్ లకు దమ్ముంటే అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పవర్ లేదని, సొంత పార్టీలో క్యాడర్ పట్టించుకోవడంలేదని, భవిష్యత్తులో పవర్ రాదని ప్రస్టేషన్ లో కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జైలుకు పంపితే సానుభూతి వస్తుందనే అక్కసుతోనే రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

కాంగ్రెస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం ఆఫీస్ లకు బహుజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. రేవంత్ ది ఈవెంట్ మేనేజర్ తప్ప పీసీసీ అధ్యక్షుడి స్థాయి కాదన్నారు. త్వరలోనే గాంధీభవన్ కు టూలెట్ బోర్డు పెడతారనే అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నాడన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News