మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (వీడియో)

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలో ఈటల గెలిచిన నాటినుంచి బీజేపీ కార్యకర్తల ఫోన్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆయన… మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆదివారం పోలీసులపై విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్ద జరిగిన […]

Update: 2021-11-07 11:51 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలో ఈటల గెలిచిన నాటినుంచి బీజేపీ కార్యకర్తల ఫోన్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆయన… మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆదివారం పోలీసులపై విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్ద జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రధాన రహదారి గుండా లోపలికి వెళ్లడానికి వచ్చిన గువ్వల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి వస్తున్న కారణంగా ఆ దారిగుండా ఎవరికీ అనుమతి లేకపోవడంతో పోలీసులు గువ్వల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పోలీసులను ఉద్దేశించి ‘‘ఏం చేస్తావ్ రా’’ అని మాటజారారు. దానికి కోపం వచ్చిన పోలీసులు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ‘అలా మాట్లాడకండి, రా’ అంటే మీ కీర్తి కిరీటం ఏమి పెరగదు అన్నారు. ఈ తతంగాన్ని అక్కడే కొంతమంది సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాట్సాప్‌లలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

Tags:    

Similar News