నేషనల్ హైవేపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్ (వీడియో)
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. హైవేపై ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ను దుర్భాషలాడారు. ఈ సంఘటన ఆదివారం బాలానగర్ మండల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళుతోన్న ఓ కారులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. వేగంగా వెళుతోన్న వారి కారుకు ఆర్టీసి బస్సు సైడ్ ఇవ్వలేదు. దీంతో వారు ఆగ్రహానికి గురై […]
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. హైవేపై ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ను దుర్భాషలాడారు. ఈ సంఘటన ఆదివారం బాలానగర్ మండల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళుతోన్న ఓ కారులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. వేగంగా వెళుతోన్న వారి కారుకు ఆర్టీసి బస్సు సైడ్ ఇవ్వలేదు. దీంతో వారు ఆగ్రహానికి గురై బస్సును ఓవర్టేక్ చేసి తమ కారుకే సైడ్ ఇవ్వవా? అని డ్రైవర్ వద్దకు వెళ్లి లాఠీతో బస్సును కొడుతూ డ్రైవర్ను దుర్భాషలాడారు. ఇది గమనించిన కొంతమంది ప్రయాణికులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ సంఘటనకు పాల్పడింది హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు అని సమాచారం. బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్గా మారింది.