ఎమ్మెల్యే ఇంటివారు కార్పొరేటర్‌‌గా గెలవలేదు

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పరాభావం ఎదురైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి బేతీ స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి చేతన హరీష్ పై 789 ఓట్ల తేడాతో స్వప్న ఓడిపోయారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఉన్న స్వప్న ఓటమి పాలవ్వడంతో ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్యనందిత ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ […]

Update: 2020-12-04 05:54 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పరాభావం ఎదురైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి బేతీ స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి చేతన హరీష్ పై 789 ఓట్ల తేడాతో స్వప్న ఓడిపోయారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఉన్న స్వప్న ఓటమి పాలవ్వడంతో ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్యనందిత ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కె.రచనశ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేల కుటంబసభ్యులకు బీజేపీ నుంచే ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురుకావడం గమనార్హం.

Tags:    

Similar News