‘గ్రేటర్’ ఎలక్షన్.. బీ ఫారం కోసం గులాబీ లీడర్ల కొట్లాట..
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కొత్త పంచాయితీకి తెరలేపాయి. అధికార పార్టీ నుంచి టికెట్‌దక్కని నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గురువారం మధ్యాహ్నం తర్వాత బీఫాంలు అందజేశారు. అయితే బీ ఫారం తనకే వస్తుందని భావించి గంపెడాశలు పెట్టుకున్న గడ్డం యుగేందర్ అనే నాయకుడికి పార్టీ షాక్ ఇచ్చింది. యుగేందర్‌కు కాకుండా మరుపల్ల రవి అనే నాయకుడికి బీ ఫారం […]
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కొత్త పంచాయితీకి తెరలేపాయి. అధికార పార్టీ నుంచి టికెట్‌దక్కని నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గురువారం మధ్యాహ్నం తర్వాత బీఫాంలు అందజేశారు. అయితే బీ ఫారం తనకే వస్తుందని భావించి గంపెడాశలు పెట్టుకున్న గడ్డం యుగేందర్ అనే నాయకుడికి పార్టీ షాక్ ఇచ్చింది.
యుగేందర్‌కు కాకుండా మరుపల్ల రవి అనే నాయకుడికి బీ ఫారం అందజేసింది. మరుపల్ల రవి ఎల్‌బీ కళాశాలలో రిటర్నింగ్ అధికారికి బీఫారం అందజేసే క్రమంలో యుగంధర్ లాక్కోవడం కలకలం రేపింది. దీనిని గమనించిన పోలీసులు వెంటనే యుగంధర్‌ను బయటకు పంపించారు. అనంతరం ఎల్‌బీ కళాశాల వద్ద కూడా టీఆర్‌ఎస్ నేతల మధ్య కొద్దిసేపు తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత కొనసాగింది.