‘187 ఏకరాల భూమిని కబ్జా చేసేందుకు టీఆర్ఎస్ నేతల యత్నం’
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ శివారులో సుమారు 187 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, ఎల్‌హెచ్ పీఎస్ జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గురువారం నారాయణపురం గ్రామాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన భూములకే ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదని.. రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్, బెల్లయ్య మాట్లాడుతూ.. వందల […]
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ శివారులో సుమారు 187 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, ఎల్‌హెచ్ పీఎస్ జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గురువారం నారాయణపురం గ్రామాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన భూములకే ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదని.. రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అద్దంకి దయాకర్, బెల్లయ్య మాట్లాడుతూ.. వందల సంవత్సరాల నుంచి పట్టా భూములుగా ఉన్న వ్యవసాయ భూములు.. రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లాగా రికార్డులో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై.. సుమారు 187 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ధరణి వెబ్‌సైట్ తప్పుల తడకగా ఉందని.. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. నారాయణపురం గ్రామ రైతులకు పట్టాలు ఇవ్వకపోతే ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే ధరణిలో తప్పు ఒప్పులను సరిదిద్ది రైతులు, పోడు భూముల హక్కు దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.