రైతన్నకు అండగా గులాబీ దండు.. మంత్రి సబితా పిలుపు ఇదే

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ ధర్నాలు విజయవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టనందని, ఈ […]

Update: 2021-11-11 09:56 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ ధర్నాలు విజయవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టనందని, ఈ నిరసన కార్యక్రమాలను రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు.

శాంతియుత ప్రజా ఉద్యమంతో రాష్టాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ నేడు రైతుల పక్షాన పోరుకు సిద్దంమైందన్నారు. పార్టీ నిరసన సెగ ఢిల్లీకి తాకాలని, ధర్నాలు భారీ ఎత్తున నిర్వహించేలా కార్యాచరణ చేశామన్నారు. ఉదయం 10 గంటల నుండి జిల్లాలో ధర్నాలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్ర రైతాంగానికి గులాబీ దళం వెన్నుదన్నుగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతుందని ఆమె అన్నారు. యాసంగిలో పండే పంటను గుజరాత్‌లో లాగే తెలంగాణ లోను కొనాలని మంత్రి డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైనందున, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకొని ధర్నాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. యాసంగి వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం నిరంకుశ వైఖరిపై మండిపడ్డారు. రైతులు పండించిన పంటలను లాభనష్టాలు చూడకుండా కొనుగోలు చేయాల్సిన కేంద్రం.. వారితో వ్యాపారం చేయాలని చూస్తున్నదని మంత్రి ఆరోపించారు. ఆయా నియోజకవర్గల్లో పార్టీ శ్రేణులు, పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితిలు, మార్కెట్ కమిటీ పాలక వర్గాలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Tags:    

Similar News