ఆ చానల్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి టీఆర్‌ఎస్ ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేందుకు రాజ్ న్యూస్ చానల్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని, ఆ చానల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం బుద్ధభవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటలకు ఓటు వేయమంటున్న హరీష్ రావు… ఇదిగో సాక్షం అనే కథనాన్ని రాజ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేందుకు రాజ్ న్యూస్ చానల్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని, ఆ చానల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం బుద్ధభవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటలకు ఓటు వేయమంటున్న హరీష్ రావు… ఇదిగో సాక్షం అనే కథనాన్ని రాజ్ న్యూస్ ప్రసారం చేసిందన్నారు. ఈ కథనం వాస్తవం కాదన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ను దెబ్బతీసే కుట్రలో భాగంగా.. ఈటలపై అభిమానం చూపుతున్నట్లు వార్తను ప్రసారం చేసిందని ఆరోపించారు.
తప్పుడు కథనాలతో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకునే యత్నం చేస్తుందని మండిపడ్డారు. తప్పుడు కథనాలను ప్రచురించిన రాజ్ న్యూస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్తుంటే ఇలాంటి కథనాలు మోడల్ ప్రవర్తనా నియమావళి, ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్లను ఉల్లంఘించడమేనన్నారు. తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని తక్షణమే నిలిపివేసేలా వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.