చీప్‌గా దాని కోసం కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు

దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద శుక్రవారం జరిగిన దసరా వేడుకల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాణసంచా విషయమై గొడవ ప్రారంభమైంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. జాతీయ రహదారిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే ఒక గ్రామం వద్ద జరిగిన వర్గ పోరుని సర్దుబాటు చేసి వస్తున్న ఎస్ఐ సాయిబాబుకు ఈ […]

Update: 2021-10-16 07:36 GMT

దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద శుక్రవారం జరిగిన దసరా వేడుకల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాణసంచా విషయమై గొడవ ప్రారంభమైంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. జాతీయ రహదారిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అప్పటికే ఒక గ్రామం వద్ద జరిగిన వర్గ పోరుని సర్దుబాటు చేసి వస్తున్న ఎస్ఐ సాయిబాబుకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. పండగ పూట రాజకీయాలు చేయడం ఏంటనీ పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏదెమైనా పోలీసుల రాకతో గొడవ సద్దుమనగడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News