ఎట్టకేలకు ఆ ప్రముఖ నిర్మాతని పెళ్లి చేసుకోబోతున్న త్రిష .. బయటకు వచ్చేసిన అసలైన నిజం
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భామ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం విశ్వంభర, థగ్ లైఫ్, విదాముమార్చి, వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ లైఫ్ ని గడుపుతుంది. అయితే 41 ఏళ్లు వచ్చిన ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ స్టార్ డైరక్టర్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఆ క్రమంలోనే ఈ బ్యూటీ త్వరలోనే మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను పెళ్లాడబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించిందని ఓ వార్త కోడై కూస్తోంది. ఈ ఏడాదే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన పెళ్లి వార్తలపై తాజాగా త్రిష స్పందించింది. ఈ మేరకు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించిన ఇప్పటికే వార్తలు ఎక్కువ అయ్యాయి. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాస్తున్నారు. కానీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. నేను ప్రస్తుతం నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీకే ముందు చెప్తాను' అని తేల్చిపడేసింది. దీంతో ఇప్పటికి పెళ్లి చేసుకోదేమో త్రిష అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.