శ్రీలీలకి స్పెషల్ గిఫ్ట్ పంపించిన ఆ మెగా యంగ్ హీరో..? ఆ విషయాన్ని ఇలా కన్ఫామ్ చేసేశావా బ్రో అంటున్న నెటిజన్లు..!
యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పెళ్లి సందడి’(Pelli sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ డమ్ అందుకుంది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీకి హిట్స్ కంటే ప్లాపులే ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువులపై ఫోకస్ పెట్టింది. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది అని.. స్పెషల్ గిఫ్ట్‌లు కూడా ఇచ్చి పుచ్చు కుంటున్నారని ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది.
ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు కోసం ట్రై చేస్తున్న మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav tej) రీసెంట్గా దివాళి సందర్భంగా గిఫ్ట్‌గా స్పెషల్ బాక్స్‌ను శ్రీలీల ఇంటికి పంపించారట. దీంతో వీళ్లిద్దరు మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందన్న న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంతే కాదు వీరిద్దరు కలిసి "ఆదికేశవ"(Adikesava) అనే సినిమాలో నటించారు . ఈ సినిమా ఫ్లాప్ అయినా వీళ్ళ కెమిస్ట్రీకి మాత్రం బాగానే మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు.. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కారణంగానే పంపించాడా..? లేక దాని వెనుక ఏమైనా అర్థాలు ఉన్నాయా ..? అని కొంత మంది అంటుంటే.. మరికొంత మందేమో లవ్‌లో ఉన్న విషయాన్ని ఇలా కన్ఫామ్ చేసేశావా బ్రో అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేమి ఒక బిగ్ బడా ఫ్యామిలీ ఇంటికి శ్రీ లీల కోడలు కాబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.