క్రికెట్ చరిత్రలో సంచలనం.. వన్డేలో ట్రిపుల్ సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఓ యువ క్రికెటర్ సంచలనం సృష్టించాడు. టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కఠినం. అలాంటిది దిగ్గజ ఆటగాళ్లు ఊహించని విధంగా వన్డేలో క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసి.. ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద బ్యాట్‌మెన్‌లకే సాధ్యం కానీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్పోరేట్ వన్డే మ్యాచ్‌లో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల […]

Update: 2021-02-08 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఓ యువ క్రికెటర్ సంచలనం సృష్టించాడు. టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కఠినం. అలాంటిది దిగ్గజ ఆటగాళ్లు ఊహించని విధంగా వన్డేలో క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసి.. ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద బ్యాట్‌మెన్‌లకే సాధ్యం కానీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్పోరేట్ వన్డే మ్యాచ్‌లో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల యువ బ్యాట్స్‌‌మెన్ లోవ్నిట్ సిసోడియా కేవలం 129 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. 26 సిక్సర్లు, 26 ఫోర్లతో వీరంగం సృష్టించాడు.

కాగా, కర్ణాటక క్రికెట్‌లో లవ్నిత్ సిసోడియా అద్భుతంగా రాణిస్తున్నాడు. 2019, 2020 సంవత్సరాలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక టీం తరపున లవ్నిత్ బరిలోకి దిగాడు. అయితే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చుకోలేకపోయాడు. ఏది ఏమైనా ఈ యువ కెరటం సాధించిన ఘనతకు పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకూ రోహిత్ శర్మ, డివిలియర్స్, క్రిస్ గేల్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలకు సైతం ఇది అందని ద్రాక్ష. కానీ ఈ యువ బ్యాట్స్‌మెన్ మాత్రం చేసి చూపించాడు.

Tags:    

Similar News