గిరిజనులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. జీవీ హర్షకుమార్

దిశ, ఏపీ బ్యూరో : రాజమండ్రిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న బూతం డ్రగ్స్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. దేశంలో హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తుంది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని వదిలేసి గిరిజన యువకులపై కేసులు […]

Update: 2021-11-05 08:19 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాజమండ్రిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న బూతం డ్రగ్స్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. దేశంలో హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తుంది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని వదిలేసి గిరిజన యువకులపై కేసులు పెట్టడం పోలీస్ శాఖకు సరికాదని హితవు పలికారు.

అమాయక గిరిజనులను కేసులు పెట్టి వేధిస్తారా అని ప్రశ్నించారు. ఇది పోలీస్ వ్యవస్థకి అవమానమన్నారు. మరోవైపు మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసు వివరాలను సీబీఐ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో తేలింది ఏంటో ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు అమరావతి రైతులను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ విమర్శించారు. రైతుల మహాపాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిందని..త్వరలోనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొంటారని హర్షకుమార్ తెలిపారు

Tags:    

Similar News