భూమి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆవేదన

దిశ, మణుగూరు: తెలంగాణ ప్రభుత్వంలో భూకబ్జాలు రోజురోజుకి చెలరేగిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న సమాజంలో భూములపై ఉన్న రేటు దేనికి లేదని భూకబ్జాదారులు భూములపై పడి దోచుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్టమల్లారం గానిబోయినగుంపు ప్రాంతంలోని సర్వే నెం. 49/25/అ గల ఐదు ఎకరాల మూడు కుంటల భూమిని మండలానికి చెందిన పింగాలి చిన్నరాజు కబ్జా చేశాడని గిరిజన బిడ్డ మీడియం సింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం మీడియం సింగయ్య విలేకరులతో మాట్లడుతూ… గనిబోయినగుంపు […]

Update: 2021-08-21 22:57 GMT

దిశ, మణుగూరు: తెలంగాణ ప్రభుత్వంలో భూకబ్జాలు రోజురోజుకి చెలరేగిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న సమాజంలో భూములపై ఉన్న రేటు దేనికి లేదని భూకబ్జాదారులు భూములపై పడి దోచుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్టమల్లారం గానిబోయినగుంపు ప్రాంతంలోని సర్వే నెం. 49/25/అ గల ఐదు ఎకరాల మూడు కుంటల భూమిని మండలానికి చెందిన పింగాలి చిన్నరాజు కబ్జా చేశాడని గిరిజన బిడ్డ మీడియం సింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం మీడియం సింగయ్య విలేకరులతో మాట్లడుతూ… గనిబోయినగుంపు ప్రాంతంలోని ఐదు ఎకరాల మూడు కుంటల భూమిని పింగాలి చిన్నరాజు దొంగ కాగితాలు సృష్టించి భూమిని కబ్జా చేశాడని తెలిపారు.2016లో భూమి కొన్నట్టు కాగితాలు పుట్టించి కబ్జా చేశారన్నారు. 2018లో తన భూమి తనకు తెలియకుండా పింగాలి చిన్నరాజు పేరుతో రెవిన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టా చేశారని గిరిజనబిడ్డ ఆవేదన వ్యక్తం చేశాడు. పింగాలి చిన్నరాజు వెనుక అగ్రకులాల పెత్తందారులు అండగా ఉండి తన భుమిని కబ్జా చేశారన్నారు. పింగాలి చిన్నరాజు 2018 వరకు భూమిపై అనుభవదారుడిగా లేకపోయినా.. అతనిపై ఎలా పట్టా చేశారని అధికారులపై మండిపడ్డారు.

పట్టా చేయడానికి ఎటువంటి నిజమైన పత్రాలు లేకపోయినా.. రెవిన్యూ అధికారులు పింగాలి చిన్నరాజు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి తన భూమిని కబ్జా చేశారని తెలిపారు. తన భూమి తనకు రెవిన్యూ అధికారులు ఇప్పించకపోతే రెవిన్యూ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని చనిపోతా అని ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడటం వల్లే తన భూమి కబ్జాకు గురైందని అధికారులపై మండిపడ్డారు.

అగ్రకులాల పెత్తందారులు పింగాలి చిన్నరాజు అనే వ్యక్తిని బినామీగా పెట్టుకొని విలువైన భూములను కబ్జా చేస్తున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో సమితి సింగారం, ముత్యాలమ్మనగర్ ప్రాంతాలలో అగ్రకులాల పెత్తందారులతో కలిసి పింగాలి చిన్నరాజు భూములను కబ్జా చేశారని ప్రజలు,
మహిళ సంఘాలు తెలుపుతున్నారు. నన్ను ఎవరు ఏమి చేయ్యరు..నేను ఎస్టీ వాడిని భూములు మొత్తం నాయని చెప్పుకుంటూ ఎక్కడపడితే అక్కడ భూములను కబ్జా చేస్తున్నాడని ప్రజలు మాట్లాడుతున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు దృష్టి సారించి పింగాలి చిన్నరాజుపై కఠినమైన చర్యలు చేపట్టుతే,అతని వెనుక ఉన్న అగ్రకులాల పెత్తందారులు బయటకు వస్తారని,కబ్జాకు గురైన విలువైన భూములు బయట పడతాయని పలువురు కోరుతున్నారు. మీడియం సింగయ్య భూమిని అధికారులు పరిశీలించి భూమిని సింగయ్యకు ఇప్పించాలని మండల ప్రజలు, మహిళ సంఘాలు,అఖిలపక్షపార్టీ నాయకులు,
విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

Tags:    

Similar News