లోకల్ ట్రైన్‌లో మహిళల అవస్థలు.. థానే రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట! (వీడియో)
ఇండియన్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ గురించి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రాలోని ముంబాయి లోకల్ రైళ్లలో రోజులకు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ గురించి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబాయి లోకల్ రైళ్లలో రోజులకు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా లోకల్ ట్రైన్స్ ప్రయాణికులతో మరింత కిక్కిరి పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విరరాల్లోకి వెళితే.. ముంబై - థానేలో లోకల్ ట్రైన్ ఎక్కడానికి మహిళల తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం ముంబైలో తుఫాను కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో థానే రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదకర స్థితిలో మహిళలు రైలు ఎక్కడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిపై మండిపడ్డారు. ఇలాంటి సమయంలో రైళ్ల ఫ్రీక్వేన్సీలు పెంచాలని మంత్రిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. కేంద్రం పదే పదే వందే భారత్ అంటూ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ ఇది పట్టించుకోరని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.