Steal Other's Wives: అక్కడి ప్రజలు వారి భార్యతో కాకుండా ఇతరుల భార్యలను అనుభవిస్తారు.. ఎవరైనా అడ్డొస్తే అంతేసంగతి!

Steal Other's Wives: ప్రపంచంలో అనేక తెగలు, గిరిజన జాతులు నివసిస్తున్నాయి.

Update: 2025-03-19 04:38 GMT
Steal Others Wives: అక్కడి ప్రజలు వారి భార్యతో కాకుండా ఇతరుల భార్యలను అనుభవిస్తారు.. ఎవరైనా అడ్డొస్తే అంతేసంగతి!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Steal Other's Wives: ప్రపంచంలో అనేక తెగలు, గిరిజన జాతులు నివసిస్తున్నాయి. ఈ తెగలు వారి సంప్రదాయాలు, జీవనశైలి, ఆహారానికి ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ గిరిజన జాతులు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి వారి సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. ప్రతి చోటా ప్రజలు వివాహం గురించి వారి స్వంత నమ్మకాలు, ఆచారాలను కలిగి ఉంటారు. భారతదేశంలోనే వివాహానికి సంబంధించి అనేక రకాల ఆచారాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం అలాంటి ఒక సంప్రదాయం గురించి మీకు తెలుసుకుందాం. వారి ఆచారాలు, సంప్రదాయల గురించి వింటే మీరు షాక్ అవుతారు.

పశ్చిమ ఆఫ్రికాలో నివసిస్తున్న వోడాబే తెగ ఒక వింత సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఈ తెగలో పెళ్లి చేసుకోవాలంటే వేరొకరి భార్యను దొంగిలించాలి. అక్కడి సంప్రదాయం ప్రకారం ఒకరి భార్యను మరొకరు దొంగిలించి వివాహం చేసుకుంటారు. అయితే వారికి బహుభార్యత్వం ఉంటుంది. మొదట ఇంట్లో వారు చూసిన అమ్మాయిని అందరి సమక్షంలో వివాహం చేసుకుంటారు. కానీ రెండవ పెళ్లి మాత్రం పక్కొడి భార్యను దొంగిలించి రహస్యంగా పెళ్లి చేసుకుని అనుభవిస్తాడు. పక్కొడి భార్యను దొంగిలించేటప్పుడు ఎవరైనా అడ్డొస్తే వారిని అడ్డంగా నరికి మరీ ఎత్తుకొస్తారు. సాధారణంగా మనదేశంలో రెండో పెళ్లి అంటే తెలిసిన అమ్మాయిని లేదా బంధువులకు తెలిసిన అమ్మాయిని చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి పురుషులు రెండవ వివాహం కోసం వేరొకరి భార్యను దొంగిలించాలి. ఇతరుల భార్యలను ఎత్తుకురాకుంటే అతను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించరు.

పశ్చిమ ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో నివసించే ఈ తెగ పశువుల కాపురులు. ఈ సంచార తెగ దుస్తువులు, సాంస్కృతిక వేడుకలకు ప్రసిద్ధి చెందింది. వివాహం కోసం ఒక పండుగ జరుపుకుంటారు. దీనిని గెరెవోల్ పండగ అని పిలుస్తారు. ఈ పండగలో నే రెండవ పెళ్లికోసం తీవ్ర ప్రయాత్నాలు చేస్తారు. ఇతరుల భార్యలను దొంగిలించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఎందుకంటే వేరొకరి భార్యను ఎత్తుకురావడం అంత ఈజీ కాదు కదా.

అయితే దీనికి ముందు ఒక పని చేయాల్సి ఉంటుంది. రెండోసారి పెళ్లి చేసుకునే పురుషులు వారి సంప్రదాయ దుస్తువులను ధరించి ముఖాలకు రంగులు వేసుకుంటారు. తర్వాత నృత్యం చేస్తూ రకరకాల మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు. ఎందుకంటే పక్కోడి భార్యను పడగొట్టాలంటే ఇలాంటి ఉండాల్సిందే. అలాంటప్పుడే వారు ఆకర్షితులు అవుతారని వారి నమ్మకం. అయితే తాము దొంగిలించే స్త్రీల భర్తలకు ఈ విషయం తెలియకుండా జాగ్రతగా ఉండాలి. ఆ స్త్రీ మరొక పురుషుడిని ఇష్టపడితే అతనితో పారిపోతుంది.అప్పుడు వీరిద్దరిని తీసుకువచ్చి ఆ కమ్యూనిటీ ప్రజలు వివాహం చేస్తారు.

Read More..

Snake: పాము శరీరంలో ఉండే ఈ భాగం ఇంట్లో పెట్టుకుంటే.. సంపదకు లోటు ఉండదట..!

Tags:    

Similar News