Viral Video: ఇది చాలా ఇంటెలిజెంట్ కోతి.. లక్ష విలువ చేసే వస్తువు ఎత్తుకెళ్లి మరీ.. ఏం చేసిందంటే?
ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో ఎక్కువగా జంతువుల వీడియోలు తెగ వైరలవుతుండడం గమనిస్తూనే ఉన్నాం.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో ఎక్కువగా జంతువుల వీడియోలు తెగ వైరలవుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇక కోతులకు సంబంధించిన వీడియోలు మాత్రం నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోతులు చేసే పనులు చూస్తుంటే భలే నవ్వస్తుంటుంది. ఒక్కొసారి అచ్చం మనుషుల్లాగా ప్రవర్తిస్తుంటాయి. అయితే సందర్భాన్ని బట్టి కొన్ని విషయాల్లో మనుషులు ఒప్పందం కుదుర్చుకుంటారని అందరికీ తెలిసిందే.
కానీ.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral) అవుతున్న ఓ వీడియో(Video)ని చూస్తే కోతులు(Monkey) కూడా ఆశ్చర్యకరంగా తమ ప్రయోజనాల కోసం ఒప్పందం కుదుర్చుకుంటాయని అర్థం అవుతుంది. కోతి ముందు అరటిపండు(Banana), డబ్బు(Money) పెడితే ఏది ఎంచుకుంటుంది? అంటే.. ఏం ఆలోచించకుండా అరటిపండు తీసుకుని కడుపు నింపుకుంటుందని చెబుతాం. ఇలాంటి ఘటనే యూపీ(Uttar Pradesh)లోని బృందావనంలో జరిగింది. ఓ టూరిస్ట్ ఫొటో(Photos)లు తీస్తుండగా అతని చేతిలో నుంచి రూ.1.5 లక్షలు విలువ చేసే శాంసంగ్ S25 Ultra ఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లింది. ఈ క్రమంలో ఆ కొంటె కోతి అందరికీ హాస్యం కలిగించే విధంగా ప్రవర్తించింది.
ఆ కోతి ఫోన్‌ను ఎత్తుకెళ్లి గోడపై కూర్చుంది. ఈ తరుణంలో ఆ కోతి ఆ వ్యక్తి చూస్తూ వింత చేష్టలు చేసింది. తనకు ఆహారంగా ఏదైన ఇస్తే ఆ ఫోన్ ఇస్తా అన్నట్లు ఆ కోతి వింతగా ప్రవర్తించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు కోతి వైపు ఫ్రూటీలను విసిరేశారు. కానీ అవి కోతి వద్దకు చేరలేదు. కింద పడ్డాయి. తర్వాత ఓ వ్యక్తి ఆ కోతికి మ్యాంగో జ్యూస్ విసిరేయడంతో దానిని అందుకున్న కోతి.. సంతోషంగా ఫోన్ పడేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతులు కూడా ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందం చేసుకుంటున్నాయని కామెంట్లు పెడుతున్నారు.