Trending: పొగలుకక్కుతోన్న బిర్యానీ.. తీరా లోపల చూస్తే బొద్దింక
రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు (Hotels), రెస్టారెంట్ల (Restaurants)పై ఫుడ్ సెఫ్టీ అధికారులు (Food Safety Officials) నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు (Hotels), రెస్టారెంట్ల (Restaurants)పై ఫుడ్ సెఫ్టీ అధికారులు (Food Safety Officials) నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా కల్తీ ఆహారాన్ని సప్లయ్ చేస్తూ.. కస్టమర్ల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. కిచెన్ (Kitchen)లో కుళ్లిన మాసం, ఇతర ఫుడ్ కలర్స్ (Food Colors), కల్తీ నూనెలను వినియోగిస్తూ.. ఫుడ్ సేఫ్టీకి తూట్లు పొడుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ఓ కస్టమర్‌కు వింత అనుభవం ఎదరైంది.
విజయ్ (Vijay) అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి నక్లెస్ రోడ్డు (Knuckles Road)లోని రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant)కు వెళ్లాడు. అనంతరం అక్కడ చికెన్ బిర్యాని (Chicken Biryani)ని ఆర్డర్ చేశాడు. వెంటనే సర్వర్ తెచ్చిన పొగలు కక్కుతోన్న బిర్యానిని చూసి విజయ్‌తో పాటు అతడి స్నేహితులు సగానికి పైగానే లాగించేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంతలోనే రైస్ మధ్యలో ఒక్కసారిగా బొద్దింక (Cockroach) కనబడేసరికి అతడికి నోట మాట రాలేదు. అనంతరం బిర్యానీలో బొద్దింక ఏంటని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విజయ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు (Food Safety Officials) ఫిర్యాదు చేశాడు.