దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్! ఎగ్జామ్ సెంటర్‌ గోడకు ‘పుష్ప’ డైలాగ్ చూసి షాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa 2 The Rule) సినిమా క్రేజ్ ఇంకా తగ్గడం లేదు.

Update: 2025-03-18 09:02 GMT
దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్! ఎగ్జామ్ సెంటర్‌ గోడకు ‘పుష్ప’ డైలాగ్ చూసి షాక్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప (Pushpa 2 The Rule) సినిమా క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. ఆ సినిమా డైలాగ్‌లను యువత మర్చిపోవడం లేదు.. ఇంకా వాడుతూనే ఉన్నారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్‌.. అంటూ పోలీస్‌ ముందే తొడ కొట్టే సీన్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే టీనేజర్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన వైరల్ అవుతోంది. ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై స్టూడెంట్స్ పుష్ప-2 సినిమాలోని డైలాగ్‌ను వారి స్టైల్లో రాసి ఇన్విజిలేటర్లకే షాక్ ఇచ్చారు. ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు, నీయవ్వ తగ్గేదేలే, ఆల్ ది బెస్ట్’ అని రాసి ఉంది. ఇది నేటి యువత తీరు.. అంటూ ఫోటో ఓ నెటిజన్ షేర్ చేశారు. పనికిమాలిన సినిమాలను చూస్తే పిల్లలు ఇలానే తయారవుతారని నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటివి జోక్‌గా తీసుకోవడం కాదని, సమాజంలో కొన్ని లిమిట్స్ దాటితే.. అందరికీ ఇబ్బంది అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.

 

Tags:    

Similar News