Viral: మహారాష్ట్ర సీపీఐ నాయకుడి వినూత్న నిరసన.. నెట్టింట వీడియో వైరల్
నీటి ఎద్దడి సమస్యపై మహారాష్ట్రలోని ఓ రాజకీయ నాయకుడు వినూత్న నిరసన తెలిపాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: నీటి ఎద్దడి సమస్యపై మహారాష్ట్రలోని ఓ రాజకీయ నాయకుడు వినూత్న నిరసన తెలిపాడు. బురద నీటిలో కూర్చొని స్నానం చూస్తూ నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేష్ గావ్ లో నీటి ఎద్దడి సమస్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పరిపాలనాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై పరిపాలనాధికారులకు వ్యతిరేఖంగా పెష్ గావ్ కు చెందిన సీపీఐ నాయకుడు సంజయ్ నాంగ్రే వినూత్నంగా నిరసన తెలిపాడు. పేష్ గావ్ బస్టాండ్ ఆవరణలో వర్షానికి రోడ్డుపై ఆగిన నీటి కుంటలో కూర్చొని బురద నీటితో స్నానం చేశాడు. అందరూ చూస్తుండగానే బురద నీటిని మీద పోసుకొని తన నిరసనను వ్యక్తం చేశాడు. అనంతరం స్థానిక నాయకులు సంజయ్ నాంగ్రేకు పాలాభిషేకం చేసి నిరసన దీక్షను విరమింపజేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరు ఎలా నిరసన తెలిపినా ప్రయోజనం ఉండదని, రాజకీయ నాయకులు వారికి ఆదాయం వచ్చే పనులు మాత్రమే చేస్తారని, ప్రజా సమస్యలు వారికి పట్టవని పలు కామెంట్లు పెడుతున్నారు.