Viral: ఆలయంలో బర్త్ డే వేడుకలు.. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయేన్సర్‌పై భక్తుల ఆగ్రహం

దేవాలయంలో కేక్ కోసి బర్త్ డే వేడుకలు(Birthday Celebrations) జరుపుకోవడ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయేన్సర్(Instagram Influencer) ను చిక్కుల్లో పడేసింది.

Update: 2024-12-02 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్: దేవాలయంలో కేక్ కోసి బర్త్ డే వేడుకలు(Birthday Celebrations) జరుపుకోవడ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయేన్సర్(Instagram Influencer) ను చిక్కుల్లో పడేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో 10 లక్షల ఫాలోవర్లు ఉన్న మమతా రాయ్(Mamatha Roy) అనే ఇన్‌ఫ్లూయేన్సర్ తన పుట్టిన రోజు సందర్భంగా వారణాసి(Varanasi) కాలభైరవ దేవాలయం(Kala Bhairava Temple)లో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అంతేగాక కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు సైతం గుడిలోనే జరుపుకున్నారు. గర్భగుడిలో కేక్ కోసి, మొదటి కేక్ ముక్కను దేవుడికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. ఇది కాస్త వివాదాస్పదమైంది. దీనిపై భక్తులు, మత పెద్దలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో కేక్ కోసే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడుతున్నారు. దీంతో ఆలయ ఆవరణలో కేక్ కోయడాన్ని అధికారులు నిషేదించారు. ఇదిలా ఉండగా.. ఇందులో కొత్తదనం ఏమి లేదని ఆలయ ప్రధాన పూజారి చెప్పడం గమనార్హం. 

Tags:    

Similar News