వీడి పిచ్చి తగలెయ్య.. భార్య బికినీ వేసుకునేందుకు.. ఏకంగా ఐలాండ్‌నే కొనేశాడట..

సహజంగా ఏ భర్త అయినా భార్య మీద లవ్‌ను చూపెట్టడానికి ఏ చీరలో, నగలో కొనిపెడతాడు.

Update: 2024-09-27 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సహజంగా ఏ భర్త అయినా భార్య మీద లవ్‌ను చూపెట్టడానికి ఏ చీరలో, నగలో కొనిపెడతాడు. కానీ,  భార్య మీద ప్రేమతో ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. తన భార్య బికినీ వేసుకొని సేఫ్‌గా ఉంటటం కోసం ఈ పని చేశాడట. ఈ భార్యభర్తల కాస్ట్‌లీ లవ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌ (Dubai)కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్‌ నదాక్‌ తన సతీమణి సౌదీ అల్ నదాక్‌ కోసం హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేశారు. దానికోసం ఆయన పెట్టిన ఖర్చు 50 మిలియన్ల డాలర్లు. అంటే అక్షరాలా రూ.418 కోట్లు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అంతే కాకుండా ఆ ఐలాండ్‌ వీడియోను షేర్ చేస్తూ.. ''నేను బికినీ ధరించాలనుకున్న, దానికి నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారు” అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు.

కాగా వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్, 67 వేల మందికి పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు మరి అంత ధనవంతుడైతే సొంత ఫ్లైట్ ఎందుకు లేదనీ.. ఇలాంటి హస్బెండ్ దొరికితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to soudiofarabia instagram id)


Similar News