Trending: వడోదర పోలీసుల స్టైలే వేరు.. వినూత్నంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (వీడియో వైరల్)

‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్ (Drunk and Drive Test) మందుబాబులకు సింహ స్వప్నం.

Update: 2025-01-03 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్ (Drunk and Drive Test) మందుబాబులకు సింహ స్వప్నం. సరదాగా మందేసి ఎంజాయ్ చేద్దామనుకుంటే.. రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లు ఏంట్రా బాబు అని నిత్యం మద్యం ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే మనకు తెలిసినంత వరకు పోలీసులు నోట్లో పైప్ పెట్టి బీత్ అనలైజర్‌ (Beat Analyzer)తో ఎంత మోతాదు మద్యం సేవించారని తెలుసుకుంటారు. వచ్చిన పాయింట్ల ఆధారంగా రాష్ట్రంలో వాహనదారులకు జరిమానాలు, కోర్టులో శిక్షలు వేయడం మనందరికీ తెలిసింది.

కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంలో గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని వడోదర (Vadodara) పోలీసుల స్టైలే సపరేటు. అక్కడ ఎలాంటి బ్రీత్ అనలైజర్ (Breath Analyzer) మిషన్లు వాడకుండానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. మద్యం తాగాడని అనుమానం వచ్చిన వ్యక్తిని రోడ్డు మధ్యలో ఉన్న తెల్లని డివైడర్ గీతపై నిలడి నడవమంటారు. ఒకవేళ అడుగు తూలిందా.. ఇక అంతే కేసు బుక్ చేసి కోర్టుకు పంపిస్తారు. ప్రస్తుతం వడోదర పోలీసుల ఇంట్రెస్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News