Video Viral: ఆఫీస్‌లో లీవ్ కావాలా? ఈ చిట్కా పాటించాలన్న యువతి.. ఇంతకీ ఏమైందంటే?
సాధారణంగా ప్రవేటు ఉద్యోగాల్లో లీవ్స్ ఇవ్వడం కష్టం. అత్యవసర పరిస్థితుల్లో లిమిటెడ్ సెలవులు మాత్రమే ఇస్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ప్రవేటు ఉద్యోగాల్లో (leaves) లీవ్స్ ఇవ్వడం కష్టం. అత్యవసర పరిస్థితుల్లో లిమిటెడ్ సెలవులు మాత్రమే ఇస్తారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం చాలా కష్టం ఈ క్రమంలోనే ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన ఫన్నీ వీడియో (Makeup art video) నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మేకప్ ఆర్టిస్ట్ (IT employees) ఐటీ ఉద్యోగుల కోసమే అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను మోసం చేసినట్లు చేస్తే ఆఫీస్‌లో సింపుల్‌గా సెలవులు లభిస్తాయని వీడియోలో యువతి చెబుతుంది. అయితే ఈ వీడియో మీ మేనేజర్‌కు చూపించవద్దని కీలక సూచనలు ఇచ్చింది. వీడియో ప్రకారం.. తనకు యాక్సిడెంట్ అయి.. ముఖానికి తీవ్ర గాయాలైనట్లు మేకప్ చేస్తుంది. ముఖ్యంగా తన ముఖంపై పెద్ద దెబ్బ తగిలి.. కుట్లు కూడా పడ్డట్లుగా మేకప్, అదేవిధంగా నుదిటిపై రక్తంతో ఉన్న దెబ్బ తగిలినట్లు ఉన్నట్లుగా మేకప్ వేస్తుంది.
మేకప్ అనంతరం ఆఫీస్ మేనేజర్‌కు వీడియో కాల్ చేసి.. నేను ఆఫీస్ వస్తుంటే యాక్సిడెంట్ అయింది.. కుట్లు పడ్డాయి.. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.. నాకు సిక్ లీవ్ ఇస్తారా? అని యువతి రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో ఐదు రోజులు సిక్ లీవ్ తీసుకో, హెల్త్ మంచిగా చూస్కో అని మేనేజర్ ఆవేదన వ్యక్తం చేస్తూ లీవ్ ఇస్తారు. అనంతరం తను సెలవు దొరికిందని విహారయాత్రకు వెళ్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. నువ్వు ఏం చేసినా సెలవు ఇవ్వరు.. పండగపూట కూడా చేయాల్సిందే.. అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ కూడా అడుగుతారని, అప్పుడు మోసం చేశామని తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తన ఐడియా బాగా లేదు.. తన మేకప్ క్రియేటివిటీ మాత్రం బాగుందని నెటిజన్లు ఫిదా అయ్యారు. మరో నెటిజన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేస్తూ.. అన్ని పార్టీల ఐటీ సెల్ ఉద్యోగుల కోసం.. మీకు సెలవులు రాకపోతే ఇదొక చిట్కా.. అంటూ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.