ప్రేమ, పరువు హత్యలపై గ్రోక్ అభిప్రాయం వైరల్
అమృత ప్రణయ్ కేసులో మారుతీరావు.. నిన్న కరీంనగర్‌లో కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి.. పరువు హత్యలు, పరువు కోసం పోక్సో కేసులు వేస్తుంటే.. సినిమా వారు మాత్రం లాభాల కోసం చిన్న పిల్లల లవ్ స్టోరీస్ తెరకెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : అమృత ప్రణయ్ కేసులో మారుతీరావు.. నిన్న కరీంనగర్‌లో కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి.. పరువు హత్యలు, పరువు కోసం పోక్సో కేసులు వేస్తుంటే.. సినిమా వారు మాత్రం లాభాల కోసం చిన్న పిల్లల లవ్ స్టోరీస్ తెరకెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివి చూసే కదా రీల్స్, షాట్స్ అంటూ స్కూల్ పిల్లలు చెడిపోతున్నారని, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వాదన తెరమీదకు వచ్చింది. ఇలాంటి చిత్రాలు తీసేవారిపై కేసులు పెట్టాలనే డిమాండ్ పెరిగిపోతోంది.
పరువు హత్యలను పక్కన పెడితే మైనర్ పిల్లల ప్రేమను గొప్పగా చూపించడం తప్పే. పైగా ఇందులో రొమాన్స్, నగ్నత్వం, గర్భం వగైరా వగైరా.. ఇలా పిల్లలు పక్కదారి పట్టేందుకు ఎన్ని తప్పుడు దారులున్నాయో అన్ని చూపించేస్తున్నారు. బాల్య వివాహాలు తప్పు కానీ బాల్య ప్రేమలు తప్పు కాదన్న రేంజ్‌లో సినిమాలు తీస్తున్నారు. నిబ్బ సాంగ్‌లు, నిబ్బ లవ్ స్టోరీలతో కనీసం పదో తరగతి కూడా పాస్ కాని పిల్లలను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇంతకీ ఈ విషయంలో సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. అసలు సినిమాలు చూసే అనుమతిస్తున్నారా లేదా కళ్లు మూసుకుని పర్మిషన్ పాస్ చేస్తున్నారా? స్ట్రిక్ట్ సెన్సార్‌షిప్ రూల్స్ ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుందా? కిడ్స్ ఎలాంటి మూవీస్ చూడాలనే దానిపై సరైన రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు కదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక దీనిపై గ్రోక్ ఒపీనియన్ అడగ్గా.. రాక్‌ఫోర్డ్ సినిమాకు సంబంధించిన విజువల్స్ గురించి వివరణ ఇచ్చింది. ఇందులో స్కూల్ పిల్లాడు.. తన క్లాస్‌మేట్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా ఫిదా అయిపోతాడు. ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతూ వెళ్తుంది. ఇది కాస్తా లవ్ స్టోరీగా మారుతుంది. ఇలాంటి సీన్స్ పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతున్నాయని తెలిపింది. దీనివల్ల హానర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని అభిప్రాయపడింది. అయితే పరువు హత్యలు అనేది ఒక సామాజిక సమస్య అని.. ఇది చాలా దేశాల్లో ముఖ్యంగా సాంప్రదాయ విలువలు ఎక్కువగా పాటించే సమాజాల్లో కనిపిస్తుందని చెప్పింది. ‘‘నా దృష్టిలో ఇది మానవ హక్కుల ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకం. పరువు పేరుతో జరిగే ఈ హత్యలు తరచూ కుటుంబ సభ్యులు వారి గౌరవాన్ని కాపాడుకోవడానికి చేస్తారు. కానీ ఇవి హింస, అణచివేతకు దారితీస్తాయి.
ముఖ్యంగా ఇప్పటికీ సమాజంలో మేజర్లు అయిన వ్యక్తులు ప్రేమ వివాహాలు, కులాంతర లేదా మతాంతర వివాహాలు చేసుకోవడం, సాంప్రదాయాలను అతిక్రమించడం తప్పు అనే తప్పుడు ధోరణి నెలకొని ఇది. నిజానికి ఇది అన్‌సైంటిఫిక్ భావజాలం, అవగాహన రాహిత్యం కూడాను. ఈ విధమైన కారణాలవల్ల పరువు హత్యలు జరుగుతున్నాయి. నిజానికి పరువు పేరుతో చేసే హత్యలవల్ల పరువు దక్కుతుంది అనుకోవడం అజ్ఞానం, హంతకులు అనే ముద్ర పడటంవల్ల పరువు పోతుందని ఎందుకు ఆలోచించరు? అందుకే మనుషులు మారాలి. నేను ఒక AIగా పరువు పేరుతో చేసే దారుణాలు, హత్యలు వంటివి సమర్థించను. వీటిలో న్యాయం కంటే అజ్ఞానం, భయం, అవగాహనా రాహిత్యం నుంచి పుట్టినవని చెప్పగలను. సమాజంలో విద్య, అవగాహన, సమానత్వ భావనలు పెరిగితే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయని నా ఆశ’’ అని తెలిపింది గ్రోక్.