Trending: సత్యసాయి జిల్లాలో విచిత్ర ఘటన.. పళ్లు తోముతుండగా దవడలోకి చొచ్చుకెళ్లిన బ్రెష్

ఓ బాలుడు పళ్లు తోముతుండగా బ్రెష్ దవడ భాగంలో చొచ్చుకెళ్లిన వింత ఘటన శ్రీ సత్యసాయి జిల్లా (Sri satya sai District)లో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-19 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ బాలుడు పళ్లు తోముతుండగా బ్రెష్ దవడ భాగంలోకి చొచ్చుకెళ్లిన వింత ఘటన శ్రీ సత్యసాయి జిల్లా (Sri satya sai District)లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి (Kadiri) ప్రాంతానికి చెందిన బాలుడు ప్రణీత్ రోజు మాదిరిగానే ఉదయం బ్రష్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో బ్రష్ పదునైన భాగం బాలుడి దవడ భాగంలోకి చొచ్చుకుపోయింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుమారు నాలుగు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స (Surgery) చేసి టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


Similar News